AP Covid Update: ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు, నలుగురు మృతితో 7098కి చేరిన మరణాల సంఖ్య, మొత్తం 3423 యాక్టివ్ కేసులు, కొత్త కరోనావైరస్ కేసులతో వణుకుతున్న తమిళనాడు
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra Pradesh) కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది.
Amaravati, Dec 28: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్‌గా (AP Covid Update) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (Andhra Pradesh) కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది.
గత 24 గంటల్లో 410 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 870752 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 3423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,16,57,884 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో (Andhra Pradesh’s Krishna District) కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను (COVID-19 Vaccine Dry Run) జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలోని ఐదు సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. వెయిటింగ్ రూం, వ్యాక్సినేషన్ రూంతో పాటు వ్యాక్సిన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రేపు రియల్ టైం లో వ్యాక్సిన్‌ను అందించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి. 125 మందితో డ్రై రన్‌ను నిర్వహిస్తున్నాం. డిస్టిక్ టాస్క్ ఫొర్స్‌కి సాయంత్రం పంపిస్తామని ఇంతియాజ్ ( Krishna district collector Imtiaz) తెలిపారు.
ఇదిలా ఉంటే పక్కరాష్ట్రం తమిళనాడు కరోనా కొత్త వైరస్‌తో (New Coronavirus Starin) వణికిపోతున్నది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో టాప్ ఫైవ్‌లో ఉన్నది. తాజాగా వెలుగుచూసిన కరోనా కొత్త వైరస్‌తో ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. రాష్ట్రానికి ఇప్పటివరకు బ్రిటన్ నుంచి 1438 మంది వచ్చారు. అందులో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా, వారిని కలిసిన మరో 12 మందికి కూడా కరోనా సోకినట్లు తేలింది.
దీంతో బ్రిటన్ నుంచి వచ్చినవారిని ఇంకెంత మంది కలిసారనే విషయం గురించి ప్రభుత్వం ఆరా తీస్తున్నది. వారిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో బ్రిటన్ నుంచి వచ్చినవారిలో 13 మందికి పాజటివ్ వచ్చిందని, వారి ద్వారా మరో 12 మందికి కరోనా వైరస్ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సీ విజయభాస్కర్ తెలిపారు.