Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, December 28: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి రెండు లక్షలకు (Coronavirus in India) చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 279 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,02,07,871కు (Coronavirus Cases in India) చేరింది. ఇప్పటి వరకు 1,47,901 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 21,131 మంది డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 97,82,669 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,77,301 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. యాక్టీవ్‌ కేసుల్లో అత్యధికంగా కేరళలో 65, 644 ఉండగా.. మహారాష్ట్రలో 60,347 కేసులున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 6,713 కేసులు నమోదయ్యాయి.

ఇక భారత్‌లో కరోనావైరస్ టీకా పంపిణీకి యంత్రాంగం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్‌ (Dry Run)ను సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో 2 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డ్రై రన్‌లో పలు కీలక దశలు ఉంటాయి.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్

ప్రతి జిల్లాలో 100 మందికి అవసరమైన డమ్మీ టీకాను సమీప డిపో నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తెస్తారు. వ్యాక్సిన్‌ తీసుకొనే వ్యక్తికి ఎస్‌ఎంఎస్‌ పంపిస్తారు. ఇందులో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం వంటి వివరాలుంటాయి. టీకా తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది.సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే చికిత్స చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారు.

మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్‌ డ్రిల్‌ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తారు.