Dr.Sudhakar Case: డాక్టర్ సుధాకర్ పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మండిపడిన విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా

హైకోర్టు ఆదేశాలమేరకు (AP High Court) సుధాకర్‌పై నమోదైన కేసును సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు.

Visakhapatnam Police Commissioner RK Meena (Photo-ANI)

Amaravati, June 12: ఇటీవల సస్పెన్షన్‌కి గురైన వివాదాస్పద వైద్యుడు సుధాకర్‌ (Dr.Sudhakar) పదే పదే పోలీస్‌ స్టేషన్‌కు వస్తూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా (Visakhapatnam CP R K Meena) మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలమేరకు (AP High Court) సుధాకర్‌పై నమోదైన కేసును సీబీఐకి అప్పగించారని, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఆయన పోలీస్‌స్టేషన్‌కు రావడం ఎందుకని సీపీ మీనా ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ నాకు దేవుడితో సమానం, డాక్టర్ సుధాకర్ కొత్త పలుకు, గుండు కొట్టిన వాళ్ల పేరు చెబితే గొడవలవుతాయన్న డాక్టర్

ఆయన సీబీఐ వద్దకు ఎందుకు వెళ్లడం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని సుధాకర్‌ పోలీస్‌స్టేషన్‌కు (Vizag police station) వచ్చి డిమాండ్‌చేస్తున్నారని.. ‘పోలీసులు పోయిన ఉద్యోగాలు ఇస్తారా? ఏమైనా అడగాలనుకుంటే ప్రభుత్వాన్ని అడగాలని అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ తరుచూ పోలీస్‌స్టేషన్‌కు రావడం వెనక ఓ రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ

సుధాకర్‌కు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్ట్ ఆదేశాలను తాము పాటిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుపై సుధాకర్‌కు గౌరవం లేదా అని, సీబీఐ విచారణ మీద నమ్మకం లేదా అని ఆర్‌కే మీనా ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్‌ ముందు సుధాకర్ మీడియా సమావేశం పెట్టడమేంటని వ్యాఖ్యానించారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌

మీడియాతో మాట్లాడే ముందు సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు ఫాక్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. సీబీఐ కూడా సుధాకర్ ఎవరెవరిని సంప్రదిస్తూన్నారో, అతని వెనక ఉన్న వారెవరో ధృవీకరించాలన్నారు. విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది, దివ్య హత్య కేసులో మొత్తం ఆరుమంది అరెస్ట్, లోతుగా విచారణ చేపడుతున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు

గురువారం విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన కమిషనర్‌ దివ్య హత్యకేసు విచారణను పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్య హత్యకేసు విచారణపై నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా గురువారమిక్కడ మాట్లాడుతూ.. నిందితులు వసంత, గీతను కస్టడీకి తీసుకున్నాం. మిగిలిన నలుగురు నిందితులను కూడా పోలీస్‌ రిమాండ్‌కు అప్పగించమని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం. న్యాయస్థానం అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుంటాం.

ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తున్నాం. దివ్య తల్లి, సోదరుడు, అమ్ముమ్మ ఓ రౌడీ షీటర్‌ చేతిలో హత్యకు గురైనట్లు నిందితులు చెబుతున్నారు. అయితే వాళ్లు హత్యకు గురయ్యారా? లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు.