Vizag Divya Murder Case: విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది, దివ్య హత్య కేసులో మొత్తం ఆరుమంది అరెస్ట్, లోతుగా విచారణ చేపడుతున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు
shamshabad Murder Case Cops change victim's name to 'Disha and telangana-cm-kcr-responds-on-justice-for-disha (photo-PTI)

Visakhapatnam. June 8: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును (Vizag Divya Murder Case) విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దివ్య హత్యలో పాల్గొన్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని విశాఖ పోలీసులు యోచిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసి, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్టయిన సంగతి విదితమే.  ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి, పాము పిల్లలని అడవిలో వదిలేసిన అక్కడి వాసులు

దివ్య హత్య కేసులో ఏ1 గా వసంత, ఏ2గా వసంత సోదరి మంజు, ఏ3గా వసంత తల్లి ధనలక్ష్మి, ఏ4గా వసంత మరిది సంజయ్ ఏ5గా గీత అలియాస్ కుమారి, ఏ6గా దివ్య పిన్ని కాంతవేణిలపై ఐపీసీ 302,343,324,326తో పాటు.. మహిళల అక్రమ రవాణచట్టం 201,294 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. వీరికి ఆదివారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి, మొదటి అదనపు జడ్జి ఎదుట హాజరుపర్చగా 19 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. వివాహేతర సంబంధం చిచ్చు, భర్తను చంపేందుకు మటన్‌లో సైనేడ్ కలిపిన భార్య, తినకుండా తప్పించుకున్న భర్త, పోలీసుల అదుపులో నిందితులు

కాగా పోలీసుల (Visakhapatnam Police) విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిన్న క్రితం ఉపాధి నిమిత్తం విశాఖకు వచ్చిన దివ్య (Divya) వసంత ఇంటిలో ఆశ్రయం పొందింది. కేసులో ప్రధాన నిందితురాలు అయిన వసంత, దివ్య పిన్ని కాంతివేణిల మధ్య పాత పరిచయం ఉండటంతో ఆ పరిచయంతోనే దివ్యను ఆమె పిన్ని కాంతవేణి.. వసంత ఇంటికి తీసుకొచ్చింది.  భార్యను సైనేడ్‌తో చంపేశాడు, అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్, వీడిన మదనపల్లి కేసు మిస్టరీ

అప్పటికే విశాఖలో వసంత వ్యభిచార నిర్వహకురాలిగా ఉండగా, దివ్య పిన్ని కాంతవేణికి సైతం ఈ వృత్తిలోనే వసంత పరిచయం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దివ్యను సైతం వసంత వ్యభిచార రొంపిలోకి దింపినట్లు అనధికార సమాచారం. గత ఏడాదిన్నరగా దివ్య ద్వారా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించి వసంత బాగా డబ్బులు సంపాదిస్తునట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ మధ్య కాలంలో వసంత చేసిన మోసాన్ని దివ్య గ్రహించడంతో ఇద్దరి మధ్యా బేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. భార్య తల నరికాడు, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు, తర్వాత జనగణమణ పాడి భారత్ మాతా కి జై అన్నాడు, యూపిలో భయాందోళనకు గురి చేసిన హత్య, కేసు నమోదు చేసిన పోలీసులు

దీంతో దివ్య అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేయడంతో కక్ష పెంచుకున్న నిందితురాలు వసంత.. కొందరితో కలిసి ఆమెకు గుండు కొట్టించి అతిక్రూరంగా ఐదు రోజుల పాటు హింసించి హత్య చేశారు. మృతురాలి శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు

దివ్య మరణించాక ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్‌ చేసి ఎంత డబ్బయినా ఇస్తానని వసంత ఆశ చూపించింది. అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోర్త్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యది సహజ మరణంగా చూపడానికి ఆమె ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించి హత్య కోణంలో దర్యాప్తు చేశారు. దీంతో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.