UP Horror Murder-horror-man-severs-wifes-head-takes-it-to-police-station-sings-national-anthem-and-chants-bharat-mata-ki-jai (Photo-IANS)

Lucknow, February 2: భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అటువంటి వాటికి పెద్దగా రియాక్ట్ కానవసరం లేదు. కానీ, ఉత్తర ప్రదేశ్‌కి (Uttar Pradesh) చెందిన ఒక వ్యక్తి మాత్రం తన భార్యతో జరిగిన చిన్న గొడవను సీరియస్‌గా తీసుకొని ఆమెను చంపాడు. ఆమెను కిరాతకంగా నరికి చంపిన భర్త.. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

వాళ్లు పిచ్చి కుక్కలతో సమానం

పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పూర్‌కు (Bahadur Pur village) చెందిన అఖిలేశ్ రావత్ భార్యతో కలిసి నివసిస్తున్నాడు. నిన్న వారి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి ఘర్షణ మొదలైంది. దీంతో సహనం కోల్పోయిన అఖిలేశ్ భార్యను దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహం నుంచి తలను వేరుచేశాడు.

దానిని చేతితో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. రోడ్డు వెంట తలపట్టుకుని నడుస్తున్న అతడిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డు మీద పోయేవారు చూసి జహంగీరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య, నిందితుడికి మరణ శిక్ష విధించిన ఒడిషా కోర్టు

పోలీసులు తన వద్దకు రాగానే అఖిలేష్ వెంటనే జాతీయగీతం (National anthem) పాడటం మొదలుపెట్టాడు ఆ తర్వాత ‘భారత్ మాతా కి జై’ (Bharat Mata Ki Jai) అని నినాదం చేశాడు. అలా కాసేపు అఖిలేష్‌కు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అతని భార్య తలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు అఖిలేష్ రావత్ తన భార్యను మొదట హత్య చేసి, ఆపై ఆమె తలను నరికినట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ చతుర్వేది (Arvind Chaturvedi) తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మృగాళ్ల వేటలో మరో మహిళ మృతి

ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల క్రితం ఓ అత్యాచార ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆగ్రాకు చెందిన ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థి(20) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. నిందితుడు తనకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.