Hyderabad, November 01: యావత్ దేశంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారం(Doctor Rape and Murder Case)పై ప్రముఖులు ఘాటుగా స్పందించిన సంగతి తెల్సిందే. క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదలు నటుడు మహేష్ బాబు వరకు అంతా ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV Tweet On Doctor Murder Case) కూడా స్పందించారు.
ఇంతటి ఘోరానికి పాల్పడ్డవాళ్లను పిచ్చికుక్కలతో(we should ignore the culprits like dogs) పోల్చారు. వెటర్నరీ డాక్టర్ ను దారుణంగా హత్య చేసిన వారి మానసిక స్థితి పిచ్చికుక్కల కన్నా హీనంగా ఉంది. అలాంటి పిచ్చికుక్కలను హింసించి చంపాలని డిమాండ్ చేయటం కూడా వృథాయేనని అన్నారు.
వాళ్లకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. దానికి బదులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. ఏ రేపిస్ట్ కూడా గత అనుభవాల నుంచి ఏం నేర్చుకోరు. 2012లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు మనం ఇదే నేర్చుకున్నాం.
RGV Tweet
Fear of punishment can never stop any crime because a criminal by nature will believe that he will never be caught ..if he even thinks he might get caught he will never commit a crime
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2019
ఎందుకంటే వాళ్లకు గతం నుంచి భయం నేర్చుకునేంత మెంటల్ కెపాసిటీ ఉండదు. ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్క చేసిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది’ అని వర్మ ట్వీట్ చేశారు.
RGV Tweet
Instead of just catching,punishing and forgetting till the next rape happens we as people should hear from their mouths why exactly they came to think of women like prey to be hunted so that by understanding those mindsets we can hope to detect other potential rapists
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2019
దాని బదులు మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వవచ్చనే దానిపై సమయం కేటాయిస్తే బాగుంటుందన్నారు. వారిని ప్రశ్నించడం ద్వారా వాళ్లల్లో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకొనే ఛాన్స్ ఉంటుందన్నారు.
RGV Tweet
Instead of impractical emotional outbursts of wanting to castrate them and burning them the concerned organisations should demand for a televised questioning of the rapists by psychiatrists and social scientists to understand what makes such people possible
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2019
వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు ? ఎందుకు ఆలోచించారు ? అని తెలుసుకొంటే భవిష్యత్‌లో రేపిస్టులను పసిగట్టే అవకాశం ఉంటుందని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.