Dr Sudhakar Case: డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ
cbi-files-case-against-dr-sudhakar-for-violating-lockdown (Photo-Video grab)

Amaravati, June 3: ఈ మధ్య కాలంలో ఏపీలో పలు సంచలనాలు, వివాదాలకు కారణమైన కేసుల్లో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు (Dr Sudhakar Case) ఒకటి. ఆయన వివాదాస్పద వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు (AP High Court) సీబీఐకి అప్పగించింది. కాగా కేసు సీబీఐ (CBI) దగ్గర కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు (Lockdown Violation), బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి వెల్లడించారు. కేసు వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్టు తెలిపారు. మంగళవారం రాత్రి సుధాకర్ మీద 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

విశాఖపట్నంలో నడిరోడ్డుపై ఆందోళనకు దిగిన సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను, పంపించిన వీడియోను సుమోటో పిల్ గా పరిగణించి హైకోర్టు కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. ఇదిలావుంటే, ట్రాఫిక్ కు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణపై డాక్టర్ సుధాకర్ మీద కేసు నమోదు చేశామని, అయితే ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని విశాఖపట్నం ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ తెలిపారు. ఘటన జరిగినప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ అనే విషయం పోలీసులకు తెలియదని ఎసీపీ చెప్పారు.

మద్యం సేవించిన వ్యక్తి అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లారని, వారిపై సుధాకర్ తిరగబడ్డారని ఆయన చెప్పారు. అంతేకాకుుండా పోలీసులనే కాకుండా ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రిని దుర్భాషలాడారని, బెదిరించారని ఆయన వివరించారు. హోంగార్డు చేతిలోని సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారని, తనను గాయపరుచుకున్నాడని ఆయన వివరించారు. దాంతో నాలుగో పట్టణం పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని చెప్పారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు

నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్‌ సుధాకర్‌.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. యత్నం చేశారు. అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం విమర్శలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీడియోలో కూడా బయటకు వచ్చాయి.

మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ను ఎమ్మెల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కరోనా కారణంగా బ్రీత్‌ ఎనలైజర్‌ను వాడకుండా కేజీహెచ్‌లో రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు రిఫర్‌ చేశారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్‌ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుమీద ప్రజాప్రతినిధులను దూషింంచడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను తూలనాడటంతో పాటు స్థానికులను భయ బ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సిడి ఫైల్‌ను నాలుగో పట్టణ టౌన్‌ పోలీసులు సీబీఐకి అందించారు.