cbi-files-case-against-dr-sudhakar-for-violating-lockdown (Photo-Video grab)

Amaravati, June 11: విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు (Dr Sudhakar Comments) చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను తిట్టిన సుధాకర్ తాజాగా జగన్ దేవుడు (AP CM YS jagan) లాంటివాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానసిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకు వచ్చిన సుధాకర్ (Narsipatnam Doctor Sudhakar) పలు విషయాలు వెల్లడించారు. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ

అదే సమయంలో తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ దేవుడని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

విశాఖ మానసిక చికిత్సాలయం నుంచి హైకోర్టు (Andhra Pradesh High Court) ఆదేశాలతో బయటికి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డాక్టర్ సుధాకర్ గతంలో పోలీసులు సీజ్ చేసిన తన కారును తీసుకెళ్లేందుకు నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ముందు సీఎం జగన్ ని పొగిడారు. ప్రధాని మోడీ గారిని కూడా నేను తిట్టలేదు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా?, శత్రువులను కూడా నేను తిట్టను.

ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి నాయకుడ్ని తిడతానా?, ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు. చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారని, ఆయన హయాంలో కూడా పని చేశాను. చంద్రబాబు కార్యకర్తనైతే కాదు. అందరూ బాగానే పాలించారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు, 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించిన ఏపీ హైకోర్టు

తాను నర్సీపట్నం ఆస్పత్రిలో సస్పెండ్ దగ్గర నుంచి పిచ్చాస్పత్రి ఘటన వరకూ ఏం జరిగిందో సుధాకర్ పూర్తిగా వివరించారు. ‘‘సస్పెండ్ అయిన దగ్గర నుంచి బ్యాడ్‌ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. టార్చర్ భరించలేక బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డా. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా ఎవరో ఫాలో అవుతున్నారని కారు ఆపా. అప్పటికే కారులో కొంత డబ్బు ఉంది.. వెంబడిస్తున్నారని కారు దిగితే అల్లరిమూకలు తనపై దాడి చేశారు. పోలీసులకు కూడా తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తున్నట్లుగా పోలీసులకు కంప్లైంట్ చేశారని ఆ రోజు ఘటనను సుధాకర్ గుర్తు చేసుకున్నారు.అసలు ఆ రోజు పోలీసులు తనను కొట్టలేదని, కొంతమంది రౌడీ మూకలు కొట్టి, షర్ట్ విప్పారని ఆయన అన్నారు. అక్కడి నుంచి పోలీసులు స్టేషన్‌కి తీసుకొచ్చినట్లు సుధాకర్ పేర్కొన్నారు. డ్రంకన్ టెస్ట్ కూడా చేయలేదని తెలిపారు.

నర్సీపట్నం ఆసుపత్రిలో కుట్ర జరుగుతోందని, అక్కడి నుంచి తనను పంపాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని, డిస్మిస్ చేయాలని కొంతమంది ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోర్ట్ హాస్పిటల్ హైవేపై ఘటన జరిగినప్పుడు చాలా రెచ్చగొట్టారని సుధాకర్ వివరించారు. మెంటల్ ఆసుపత్రిలో తనకు మత్తు ఇవ్వడంతో, చాలా రోజులు స్పృహలేదని, అందుకే సీబీఐ వచ్చినప్పుడు వాళ్లు ఏం అడిగారో అర్ధం చేసుకోలేకపోయానని అన్నారు.

తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వివరించారు. ఏ కేసులూ వద్దని చెప్పినా.. సుమోటోగా కొంతమంది కేసు వేసినట్లు సుధాకర్ తెలిపారు. తనకు ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉందని.. షుగర్, బీపీ, గుండె సమస్యలు ఉన్నాయని, వాలంటరీ రిటైర్మెంట్ అవ్వాలనుకున్న లోపే ఇలా జరిగిందని అన్నారు. తన పేరు మీద పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకుంటానని, తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే చాలని విఙ్ఞప్తి చేశారు. వాలంటరీ రిటైర్మెంట్‌కి అవకాశం ఇస్తే చాలని, మంచి డాక్టర్‌గా క్లీన్ చిట్‌తో రిటైర్ అయితే అదే తనకు చాలని ఆయన అన్నారు. తన వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండని సుధాకర్ వివరించారు.

ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే తనపై దాడి చేశారని, పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారని, తనకు గుండు గీసిందెవరో వారి పేరు చెప్పనని సుధాకర్ చెప్పుకొచ్చారు. ఆ విషయాలు చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నట్లు సుధాకర్ వెల్లడించారు.

తనను ఎవరూ ఉపయోగించుకోలేదని, అలా చేసుంటే వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. ఆస్పత్రిలో చంపేస్తామని బెదిరిస్తే.. ఇంట్లో వాళ్లు కూడా భయపడ్డారని, తమకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని, అవి చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. అలాంటిది రాజకీయాలతో నాకు పనేంటి?, రాజకీయమంటేనే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం'' అని డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.