Engineering Courses Fee: ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం.. గరిష్ఠ ఫీజు రూ.1.05 లక్షలు, కనిష్ఠం రూ. 40 వేలు

ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు.

exam students

Vijayawada, July 8: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో (Engineering Courses Fee) బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు. ట్యూషన్ , అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు.

హైదరాబాద్ ‘ది కేవ్‌ పబ్‌’లో గంజాయి పార్టీ.. దాడి చేసి 24 మందితో పాటు మేనేజర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు (వీడియో)

ఏ కాలేజీల్లో ఎలా?

ఏపీలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్చిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ. లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు అయ్యింది.

ఉచిత ఇసుక పాల‌సీ అమ‌లుకు రంగం సిద్ధం, ట‌న్నుకు రూ. 88 వ‌సూలు చేయ‌నున్న ప్ర‌భుత్వం



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్