Hyderabad, July 8: హైదరాబాద్ (Hyderabad) లోనూ క్రమంగా డ్రగ్ (Drug), గంజాయి (Ganja) సంస్కృతి పెరిగిపోతున్నది. వీకెండ్ థీమ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్న ది కేవ్ పబ్ పై పోలీసులు దాడి చేసి మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో గంజాయి తీసుకున్న 24 మందితో పాటు మేనేజర్ ను అరెస్టు చేశారు. డీసీపీ వినీత్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఖాజగూడలోని ఎస్‌వీ ఆర్కేడ్ భవనంలోని ‘ది కేవ్ పబ్’లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఎస్‌వోటీ, నార్కోటిక్, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.
ఉచిత ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం, టన్నుకు రూ. 88 వసూలు చేయనున్న ప్రభుత్వం
ది కేవ్ క్లబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం..
ఖాజాగూడలోని కేవ్ క్లబ్లో నైట్ పార్టీలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడి నిర్వహించిన నార్కోటిక్స్ బ్యూరో.. పార్టీలో 55 మందికి యువతి, యువకులకు డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలు.
27 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్ రిపోర్ట్.. డీజే… pic.twitter.com/Px70wv1bl0
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2024
55 మంది నమూనాల సేకరణ
పోలీసుల దాడి సమయంలో ఉన్న 55 మంది నుంచి నమూనాలు సేకరించారు. ఆ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ నివేదికలో 24 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. పార్టీకి వచ్చేముందు వీరందరూ గంజాయి సేవించి ఈ పార్టీలో పాలుపంచుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.