Father Kills Daughter: తాగిన మత్తులో కిరాతకం..తన భార్య ముందే పసికందును చంపేసిన తండ్రి, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు

తాగిన మత్తులో ఓ తండ్రి ముక్కుపచ్చలారని పసికందును అత్యంత కిరాతకంగా (Father Kills Daughter) కడతేర్చాడు.

Representational Image | (Photo Credits: PTI)

Amaravati, Jan 20: ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఓ తండ్రి ముక్కుపచ్చలారని పసికందును అత్యంత కిరాతకంగా (Father Kills Daughter) కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన బాల్‌రెడ్డి అలియాస్‌ బాలరాజు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన లక్ష్మి ఇద్దరూ అనాధలు..ఇద్దరికీ ప్లాస్టిక్‌ కాగితాలు, బాటిళ్లు ఏరుకొని విక్రయిసున్న సమయంలోనే పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి సహ జీవనానికి దారి తీసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులకు లక్ష్మీ గర్భం దాల్చింది.

దీంతో ఇద్దరు నాలుగు నెలల క్రితం జూపాడు బంగ్లాకు చేరుకొని అక్కడ బస్టాండు సమీపంలోని కేసీ కాల్వ విశ్రాంతి భవన ప్రాంగణంలో కాపురం పెట్టారు. కాగా రెండు నెలల క్రితం లక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పాపతో విశ్రాంతి భవనంలో ఉండగా బాల్‌రెడ్డి ప్లాస్టిక్‌ బాటిళ్లు ఏరుకొని విక్రయించటం, వ్యవసాయ కూలిపనులకు వెళ్లటం ద్వారా వచ్చే డబ్బుతో భార్యను బిడ్డను చూసుకుంటూ ఉన్నాడు.

అయితే సోమవారం రాత్రి మద్యం మత్తులో (alcohol) బాల్‌రెడ్డి లక్ష్మితో గొడవపడ్డాడు. ఆమెను హింసిస్తూ..ఆమె చేతిలో ఉన్న పసికందును లాక్కొని పైకి ఎత్తి కిందపడేసి పాల డబ్బాను ఆ పసికందు నోట్లో కుక్కాడు. ఊపిరి ఆడక ఆ పసిబిడ్డ మృత్యుఒడికి (Man killed his Infant daughter) చేరింది. కళ్లెదుటే బిడ్డను చంపటంతో లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది.

ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు, కొంప ముంచిన పొగమంచు, పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి వద్ద విషాద ఘటన

ఉదయం మత్తు దిగిన తరువాత ఆ కిరాతక తండ్రి శిశివు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు శ్మశానవాటిక వైపు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. నందికొట్కూరురూరల్‌ సీఐ ప్రసాదు, ఎస్‌ఐ తిరుపాలు సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారించారు. శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లికి అప్పగించారు.