Kolkata, Jan 20: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది. పొగమంచు కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి నగరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Dhupguri Road Accident) సంభవించిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 13 నిండు ప్రాణాలు బలవ్వటంతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 13 మంది మృతి (13 killed in West Bengal road accident) చెందగా.. మరికొందరు గాయపడ్డారని స్థానిక ఎమ్మెల్యే మిథాలీ రాయ్ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఓవర్‌లోడ్, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Here's ANI Update
West Bengal: 13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district last night, due to reduced visibility caused due to fog. The injured were taken to a hospital. pic.twitter.com/HHUvqCist6
— ANI (@ANI) January 20, 2021
నిన్న గుజరాత్‌లోని కొసంబా జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Gujarat Tragedy) జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైనుంచి దూసుకెళ్లడంతో 15 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర్ (Surat Tragedy) సమీపంలో కిమ్ చార్ రాస్తా (Kim Char Rasta) వద్ద ఫుట్ పాత్ పై 18 మంది నిద్రిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మరణించారు