Fee Reimbursement in AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏపీ సర్కారు గుడ్ న్యూస్, తల్లుల అకౌంట్ ఖాతాల్లోకి పూర్తి ఫీజుల మొత్తం, కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ పథకం కింద విద్యార్థులకు అయ్యే ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు అకౌంట్లలో (credited to mothers) నేరుగా జమ చేయించాలని నిర్ణయించింది.
Amaravati, April 15: ఏపీలోని విద్యార్థులకు ఏపీ సర్కారు (AP Govt) శుభవార్తను తెలిపింది.నవరత్న కార్యక్రమాల్లో కీలకమైన ‘జగనన్న విద్యా దీవెన’ (Jaganna vidya deevena) పథకానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద విద్యార్థులకు అయ్యే ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు అకౌంట్లలో (credited to mothers) నేరుగా జమ చేయించాలని నిర్ణయించింది.
కరోనాపై పోరుకు ముఖేష్ అంబానీ చేయూత
కాలేజీలకు ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలకోసారి) ఒకసారి రీయింబర్స్‌మెంట్ చేసే ఫీజులను ఇకపై విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ బకాయిలు రూ.1800 కోట్లు సైతం చెల్లించి, ఆ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు లబ్ధి చేకూర్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు.
ప్రకటన వివరాలు ఇవే :
పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ఇక వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఫీజు రీయింబర్స్ నిధులను తల్లుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తాం. ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే నేరుగా తల్లి అకౌంట్లో జమ చేస్తారు.
కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం
గతంలో ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. ఇది పోగా ఆ కాలేజీలకు నిర్ణయించిన ఫీజులోని మిగతా మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ఆయా కాలేజీల యాజమాన్యాలు వసూలు చేసేవి. ఇప్పుడు కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. 2018–19 బకాయిలను, 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడు త్రైమాసికాల (9 నెలల) ఫీజుల పూర్తి నిధులను ఆయా కాలేజీలకు ప్రభుత్వం విడుదల చేస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఆయా యాజమాన్యాలు వెనక్కు ఇవ్వకపోవడం నేరం. అలా ఇవ్వని కాలేజీలను బ్లాక్ లిస్టులో పెట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు.