Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి, చనిపోయిన వారిని ధర్మపురి వాసులుగా గుర్తించిన పోలీసులు

అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో (Car Falls into Canal) నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున రొంపిచర్ల - సుబ్బయ్యపాలెం మధ్య తంగేడుపల్లి వద్ద చోటు చేసుకుంది.

Road accident (image use for representational)

Guntur, Oct 16: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో (Car Falls into Canal) నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున రొంపిచర్ల - సుబ్బయ్యపాలెం మధ్య తంగేడుపల్లి వద్ద చోటు చేసుకుంది.

సంఘటన వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రకాశం జిల్లా రఘునాథపురం గ్రామానికి చెందిన తురక మాధవ్‌ భవన నిర్మాణ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. గత పదిహేనేళ్లుగా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఇంటికి పేయింట్‌ వేసే పని ఉండడంతో రఘనాథపురానికి మాధవ్‌ కారులోనే పేయింటర్‌ యూపీకి చెందిన బీ‌ జగదీశ్‌గౌడ్‌ (50), అతని కొడుకు శివమ్‌ (13) వెళ్లారు. వారితో పాటు మాధవ్‌ వెంట స్నేహితులు బావబావమరుదులైన ధర్మపురికి చెందిన కట్కం మహేశ్ (38), పాలాజీ ఆనంద్‌ (35) వెళ్లారు. గురువారం ధర్మపురి నుంచి రఘునాథపురానికి బయలుదేరి వెళ్లారు.

ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం, స్కూలు అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని అన్ని స్కూళ్లకు ఆదేశాలు

కారు వేగంగా వెళ్లడంతో గుంటూరు జిల్లా తంగేడుపల్లి వద్ద అదుపు తప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో జగదీశ్‌గౌడ్‌, శివమ్‌, మహేశ్‌, ఆనంద్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కారులో పెంటింగ్‌ బకెట్లు ఉండడంతో మృతులపై పడింది. ఘటనలో కాంట్రాక్టర్‌ మాధవ్‌ గాయపడగా.. నరసరావుపేట హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును కాలువలోకి బయటకు తీసి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దసరా, దీపావళి సందర్భంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు, లిస్టును విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే

ఘటన రాత్రి 2-3 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పని కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన బావమరుదులు మహేశ్‌, ఆనంద్‌ మృతితో బాధిత కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. అలాగే యూపీ నుంచి స్థానికంగా ఉపాధి పొందుతూ పేంటింగ్‌ చేసేందుకు మరో ప్రాంతానికి వెళ్లి ప్రమాదంలో తండ్రీ కొడుకులు జగదీశ్‌గౌడ్‌, శివమ్‌ మృతి చెందడం ధర్మపురిలో విషాదం అలుముకుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif