File image of passengers waiting for trains (Photo Credit: PTI)

Hyderabad,Oct 16: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని మరిన్ని ప్రత్యేక రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను (Dasara Special Trains) నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ (Indian Railway) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నిన్న కొన్ని రైళ్లను ప్రకటించగా తాజాగా మరో 18 ప్రత్యేక రైళ్లను (Dasara Special Trains 2020) విడుదల చేసింది. ఆయా రైళ్ల వివరాలను, ప్రయాణ వేళలను, అవి ఆగే స్టేషన్ల వివరాలను అధికారులు ట్విట్టర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ఆర్టీసీ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ ప్రత్యేక రైళ్లకు మరింత ప్రాధాన్యం పెరగనుంది. రైళ్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

కాచిగూడ–మైసూరు:

ఈ నెల 20 నుంచి నవంబర్‌ 29 వరకు డెయిలీ సర్వీసు. కాచిగూడలో రాత్రి 7.05కు బయలుదేరి మరుసటి ఉదయం 9.30కి మైసూరు చేరుకుంటుంది. (21 నుంచి) మైసూరులో సాయంత్రం 3.15కు బయలుదేరి మరుసటి సాయంత్రం 5.40కి కాచిగూడ చేరుతుంది. ఇది జడ్చర్ల, మహబూబ్‌నగర్, అనంతపురం, బెంగళూరు మీదుగా ప్రయాణిస్తుంది.

Here's SCR Tweet

హైదరాబాద్‌–జైపూర్‌:

సోమ, బుధవారాల్లో అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 25 వరకు. హైదరాబాద్‌లో రాత్రి 8.35కు బయలుదేరుతుంది.

జైపూర్‌–హైదరాబాద్‌:

బుధ, శుక్రవారాల్లో ఈ నెల 23 నుంచి నవంబర్‌ 27 వరకు. ఈ ప్రత్యేక రైలు జైపూర్‌లో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

హైదరాబాద్‌–రాక్సౌల్‌:

ఈ ప్రత్యేక రైలు ఈ నెల 22 నుంచి నవంబర్‌ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది హైదరాబాద్‌లో రాత్రి 11.15కు బయలుదేరుతుంది.

 దసరా నేపథ్యంలో 1,850 ప్రత్యేక సర్వీసులకు ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్, తెలంగాణతో ఇంకా కొలిక్కిరాని చర్చలు, జోరు పెంచిన ప్రైవేటు ఆపరేటర్లు

రాక్సౌల్‌–హైదరాబాద్‌:

ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది రాక్సౌల్‌లో తెల్లవారుజామున 3.25కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.

బరౌనీ–ఎర్నాకుళం:

ఈ ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి నవంబర్‌ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. ఇది బరౌనీలో రాత్రి 10.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

ఎర్నాకుళం–బరౌనీ:

ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ఆదివారాల్లో నడుస్తుంది. ఎర్నాకులంలో ఉదయం 10.15కు ప్రారంభమవుతుంది. బల్లార్షా, వరంగల్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌:

ఈ నెల 23 నుంచి శుక్ర, సోమవారాల్లో విశాఖలో ఉదయం 8.20కి బయలుదేరుతుంది. వరంగల్, బల్లార్షా మీదుగా ప్రయాణిస్తుంది.

నిజాముద్దీన్‌–విశాఖపట్నం:

ఇది ఈ నెల 25 నుంచి నవంబర్‌ 29 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీలో ఉదయం 5.50కి బయలుదేరుతుంది. బల్లార్షా, వరంగల్‌ మీదుగా ప్రయాణిస్తుంది.