Caste & Religion Column Removed: ఏపీ సర్కారు మరో సంచలన నిర్ణయం, స్కూలు అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని అన్ని స్కూళ్లకు ఆదేశాలు
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Oct 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని (Caste & Religion Column Removed) ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (Director of School Education) ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను (Caste & Religion) రిజిష్టర్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు.

నాడు-నేడు (Nadu-Nedu) కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న వైసీపీ సర్కారు విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోనే తొలిసారి కానుంది. ప్రస్తుతం వచ్చే నెల 2 నుంచి ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపింది. ఈ ఆర్డర్ ప్రకారం ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం వివరాలు కనిపించవు. ఇన్నేళ్లుగా విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన వీటిని ఇకపై హాజరు పట్టీ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

దేశంలో మూడో ప్రాజెక్టు, బెజవాడ వాసుల కష్టాలను తీరుస్తూ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన

విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా దీన్ని కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిన వీరభద్రుడు ఆదేశించారు. పాఠశాల విద్యార్ధుల హాజరు పట్టీలో బాలికల పేర్లను ఎర్రసిరాతో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం మంగళం పాడింది. ఒకే పాఠశాలలో, ఒకే తరగతి గదిలో, ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఒకే క్లాస్‌లో ఉన్న అందరు విద్యార్ధుల పేర్లు ఎలాంటి కుల, మతాల ప్రస్తావన కానీ, ఎర్రసిరా కానీ లేకుండా ఒకేలా దర్శనమివ్వబోతున్నాయి.