Vijayawada Kanakadurga Flyover (Photo-Video Grab)

Amaravati, Oct 16: బెజవాడ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్ (Kanaka Durga Flyover Inauguration) నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ( Nitin Gadkari), ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు (AP CM ys jagan Mohan Reddy) శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం (Virtual Inauguration) ద్వారా ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.

ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్‌ పూర్తయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వీకే సింగ్,కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమంలో రూ. 8007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు

2.6 కిమీ పొడవున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ. 355.8 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2 కోట్లు ఖర్చు చేసింది. 900 పనిదినాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎలివేటెడ్ వంతెనలు సాధారణంగా నాలుగు వరసలే ఉంటాయి. కాని కనకదుర్గ ఫ్లై ఓవర్ వంతెనపై ఆరు వరసలుగా నిర్మాణం చేయడంతో దక్షిణాదిన తొలి ప్రాజెక్టుగా, దేశంలో మూడో ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తొలి రెండు ఆరువరసల ఫ్లై వంతెనలు ముంబై ఢిల్లీలో ఉన్నాయి.