Heavy Rainfall Alert: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక, మరింత చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
ఈ రోజు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడనుందని.. దీని వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో రేపు కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Amaravati, June 9: నైరుతి రుతుపవనాలు (Mansoon) రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కోస్తాంధ్రలో (Coastal Andhra) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha IMD) వెల్లడించింది. ఈ రోజు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడనుందని.. దీని వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్ప పీడన ప్రభావంతో రేపు కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్టు, ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగం శ్రీకాంత్‌రెడ్డి
నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు సూచించారు. పిడుగుల పడే ప్రమాదం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కిందకు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. జూన్ 10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు
రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు (southwest Mansoon) మరింత చురుగ్గా కదులుతున్నాయి. రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని ఇతర జిల్లాలకు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. 76 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు, కోస్తాలోని ఇతర ప్రాంతాలకు, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు రాయలసీమలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాలు రాగల రెండు రోజుల్లో రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ విస్తరించనున్నాయి. మరోవైపు ఈ నెల 10 నుంచి 12వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలకు అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది.