Amaravati, June 9: అన్‌లాక్ 1 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలో ఆలయాలు (temples Reopen in AP) తెరుచుకున్నాయి. ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఎనభై రోజుల తర్వాత అన్నీ ఓపెన్, కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్‌డౌన్, ఇంకా అనుమంతిచబడనివి ఏంటో ఓ సారి తెలుసుకోండి
ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు జరగనున్నాయి. రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. అలాగే అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని వెల్లడించారు. మల్లికార్జున మహా మండపం నుంచి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు,ప్రార్థనామందిరాలు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఓ సారి తెలుసుకోండి
కొన్ని రోజులు శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికే అమ్మవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలకు భక్తులను అనుమతి లేదన్నారు. ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులను అనుమతిలేదని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయంలోకి అనుమతి లేదని తెలిపారు. మహా మండపం ద్వారా దిగువకు పంపించేందుకు సిబ్భందితో ట్రయల్ నిర్వహిస్తునట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మెట్ల మార్గం ద్వారానే దర్శనం చేసుకుని మళ్లీ అలాగే కింది వెళ్లాలని.. బస్సులు, లిఫ్టుల సౌకర్యం ఉండదన్నారు. ఉచిత దర్శనం, రూ. 100 టికెట్లు రెండూ కూడా ఆన్‌లైన్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలన్నారు. కాగా, కృష్ణా నదిలో స్నానాలు నిషేధం అన్నారు. కేశఖండనశాల వద్ద భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.