tirumala-srivari-brahmotsavam-celebrations ( Photo-wikimedia commons)

Tirumala, June 5: లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఏపీ నుంచి ఇతర రాష్టాలకు బస్సులు షురూ, అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

కాగా తొలుత ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌ పద్ధతిలో దర్శనాలను టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ప్రారంభించనుంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ (Anil kumar singhal) పరిశీలించారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గదులు కేటాయిస్తామని ఈవో పేర్కొన్నారు. సరి, బేసి పద్దతిలో గదుల కేటాయింపు ఉంటుందని, ఒక్కో రూమ్‌లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇస్తామన్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్‌ చేస్తామన్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపారు. ప్రస్తుతానికి కల్యాణకట్ట వద్దకు అనుమతి లేదన్నారు. హుండీ, అన్నప్రసాదం దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఈవో సూచించారు. ఇది నిజంగా సంచలనమే, 80 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, ఏపీలో తాజాగా 50 కేసులు నమోదు, 3,427కి చేరిన మొత్తం కరోనా కేసులు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఆయా రాష్ట్రాల అనుమతితోనే టికెట్లు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే భక్తులకు అనుమతిస్తామన్నారు. 24 గంటలు పర్యవేక్షిస్తూ భక్తుల దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఉదయం గంట మాత్రమే ప్రోటోకాల్‌ వీఐపీఎలకు అనుమతి ఉంటుందన్నారు. సిఫార్సు లేఖలకు అనుమతి లేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులకు ప్రస్తుతానికి అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ దర్శన నిబంధనలు

ఈనెల 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు దర్శనం

ఈనెల 10న తిరుపతి స్థానికులకు దర్శనానికి అనుమతి

ఈనెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం

పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయి

ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం

ఆన్‌లైన్‌లో 3వేల మంది భక్తులకు అనుమతి

ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం

ఉ.6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి

ఉ.6 నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి

అలిపిరి నుంచి మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి

శ్రీవారిమెట్టు మార్గం నుంచి ప్రస్తుతానికి అనుమతి లేదు

నేరుగా వచ్చే భక్తులకు అలిపిరి వద్ద టికెట్ కౌంటర్

అలిపిరి, తిరుమలలో టెస్టింగ్ ల్యాబ్స్

10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు

పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదు

మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి

దేశవ్యాప్తంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో భక్తులు దర్శనాలకు రావద్దు