Heavy Rains Alert in AP: మరో మూడు రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు

తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం (AP IMD) వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Amaravati, August 17: ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains Alert in AP) కురవనున్నాయి. తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం (AP IMD) వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ (Rayalaseema) ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు(మంగళవారం, బుధవారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు, మహోగ్ర రూపం దాల్చిన నదులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు (Kanna Babu) ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు.

ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ - 08912590102.. విశాఖ ఆర్డీఓ కార్యాలయం- 8790310433.. పాడేరు - 08935250228, 8333817955, 9494670039.. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ - 8247899530, 7675977897 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.