Andhra Pradesh: ఏపీలో కేసీఆర్ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తారు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి

అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Credits: TRS Twitter Fan Page

Tirumala, Jan 3: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ నేతలు దర్శించుకున్నారు. వేకువజామున వైకుంఠ ద్వారం గుండా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో పాటు పలువురు ప్రముఖులు వేర్వేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందన్నారు. తెలంగాణ కేవలం ఎనిమిదేళ్లలో అభివృద్ధి చేసిన కేసీఆర్‌.. అన్ని రాష్ట్రాలకు మోడల్‌గా తీర్చిదిద్దారన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో విజయం సాధించి కేసీఆర్ ప్రధానిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు.

చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి, పలువురికి గాయాలు, గుంటూరు సభలో విషాదం

రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును (Polavaram ) పూర్తి చేయలేకపోయారని, ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో.. అదే తరహాలో పోలవరాన్ని పూర్తి చేసి, ఆంధ్రా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై వివిధ రాష్ట్రాల ప్రజలకు సమ్మకం వచ్చిందని, కచ్చితంగా రాబోవు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.