India Independence Day 2021: రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదే, ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవవందనం స్వీకరించారు.

CM YS Jagan (Photo-Twitter)

CM YS Jagan Speech Highlights: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్‌ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan Speech) ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌ అధికారులకు సేవా పతకాలను సీఎం అందజేశారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

రూ.100 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్, పీఎం గతిశక్తి ప్రణాళికను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపిన ప్రధాని, భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన పీఎం నరేంద్ర మోదీ

వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

రేపటి నుంచి ఏపీలో మోగనున్న బడిగంట, అన్ని రకాల చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, స్కూళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్‌ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్‌బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం. ఏపీ అమూల్‌ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని’’ సీఎం అన్నారు. నాడు-నేడు" ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని’’ సీఎం అన్నారు.

ఏపీలో ఈనెల 21వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో కర్ప్యూ

‘‘అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్‌స్టేషన్లు, దిశా యాప్‌లు తీసుకొచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీకిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించాం. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.