Rayalaseema Lift Irrigation Scheme: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపండి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన కృష్ణా బోర్డు, తక్షణమే డీపీఆర్‌లను అందించాలని స్పష్టం చేసిన కెఆర్ఎంబీ

కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు (Krishna River Management Board (KRMB) పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తుచేసింది.

Srisailam reservoir (Photo-Twitter)

Amaravati, Oct 23: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు (Krishna River Management Board (KRMB) పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తుచేసింది.

వెంటనే డీపీఆర్‌లను అందించాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు వచ్చే వరకు పనులు నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా గురువారం ఏపీ జల వనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి లేఖ రాశారు.

కాగా ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనుల టెండర్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళుతోందంటూ ఈ నెల 5న తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో స్పందించిన కృష్ణా బోర్డు ఈ లేఖ రాసింది. ఇప్పటికే జూలై 29న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జీవో 203పై ముందుకెళ్లరాదని, బోర్డు, కేంద్ర జల సంఘం పరిశీలనకోసం డీపీఆర్‌లు పంపాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాలని సూచించినట్లు ఈ లేఖలో బోర్డు గుర్తు చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ, నవంబర్ లో ఎన్నికలను నిర్వహించలేమని తెలిపిన ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం సమావేశం

ఇటీవల వర్షాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో మోటార్లు నీట మునిగిన విషయం విదితమే. ఈ ఘటనపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు పంపిప్తామని లేఖలో స్పష్టం చేసింది.