AP Local Elections Postponed: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, కరోనా వివరాలను వెల్లడించిన ఏపీ సర్కారు, కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్‌ను (Coronovirus) కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు.
Amaravati, Mar 15: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా (Local Body Elections Postponed) పడింది. కరోనా వైరస్‌ను (Coronovirus) కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణాలో విద్యాసంస్థలు, మాల్స్, థియేటర్లు అన్నీ బంద్
అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని స్పష్టం చేశారు. ఏకగీవ్రంగా ఎన్నికైన వారు ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నియామవళి యధావిధిగా కొనసాగుతుందన్నారు.
టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి
ఈ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్నిగమనించాలని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆరువారాల అనంతరం ఎన్నికలు జరుగుతాయన్నారు. వాయిదా ప్రక్రియ ముగిసిన తర్వాత సమీక్ష నిర్వహించి పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.
Here's the ANI tweet:
కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసిందని, తాము కూడా అత్యవసర సమీక్ష నిర్వహించిన తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఫేక్ న్యూస్‌పై హైదరాబాద్ సీపీ వార్నింగ్, తప్పుడు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష
అత్యవరస పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉంటాయన్నారు. పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉందని, ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పడంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు.
కరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేశామని, కరోనా వైరస్‌ను నోటిఫై డిజాస్టర్ గా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుందని, చాలా సేపు క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పేపర్ వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నామన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈమేరకు ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని అందులో వివరించారు.
ఇప్పటివరకు వైరస్ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మంది
కరోనా పాజిటివ్ కేసుగా తేలింది 1
నెగెటివ్‌గా నిర్ధారణ అయింది 57 మంది
శాంపిల్స్ ఫలితాలు రావాల్సినవి 12
ఇప్పటివరకు స్క్రీనింగ్ జరిగింది, పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య: 777
పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512
28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244
ఆస్పత్రి అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21
విజయవాడలో నిర్ధారణ పరీక్ష
1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చినట్టు ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ డైరెక్టర్ చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక కోవిడ్-19 ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు.
సహాయ కేంద్రాలు జాగ్రత్తలు
24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్. నెం.0866 2410978 ఏర్పాటు. కరోనాపై సమాచారం కొరకు 104 హెల్ప్ లైన్ (టోల్‌ఫ్రీ నెంబర్)కు ఫోన్ చేయొచ్చు. దగ్గినపుడు, తుమ్మినపుడు నోరు, ముక్కుకు చేతి రుమాలు, తువ్వాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. బాధ్యతగా ఉండాలి..
కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు వైరస్ లక్షణాలు ఉన్నా లేకున్నా 28 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదు. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా ఉండాలి. దగ్గు, జ్వరం ఉన్నవారు, ఊపిరితీసుకోవడం ఇబ్బందులు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 108 సాయంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి. లేదంటే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ (0866 2410978)కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.