Heavy Rains Alert in AP: రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం

రాగల మూడు రోజులు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వాతావరణ స్థితిగతులు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ కేంద్రం (Meteorological Center) ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం (West Central Bay of Bengal) ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Amaravati, July 29: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (అమరావతి వాతావరణ కేంద్రం) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వాతావరణ స్థితిగతులు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ కేంద్రం (Meteorological Center) ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం (West Central Bay of Bengal) ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శంకర్‌ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బాధ్యతలు చేపట్టిన ఇద్దరు మంత్రులు

ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావారణ కేం‍ద్ర అధికారులు తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(బుధవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది, అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉండగా, అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.