Mana Palana - Mee Suchana Day 2: రైతులు, కూలీల్లో చిరునవ్వును చూడటమమే లక్ష్యం, రైతులకు మరిన్ని పథకాలు అందిస్తామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఈ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై (Agriculture) సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ‘రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించామని ఏపీ సీఎం ( CM YS Jagan) తెలిపారు.

Mana Palana – Mee Suchana Day 2

Amaravati, May 26: మన పాలన–మీ సూచన పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సు రెండో రోజుకు (Mana Palana Mee Suchana Day 2) చేరుకుంది. ఈ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై (Agriculture) సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ‘రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించామని ఏపీ సీఎం ( CM YS Jagan) తెలిపారు. మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే

పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఈ మూడు ప్రధాన అంశాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైతు భరోసా - పీఎం కిసాన్‌ ద్వారా రూ.13500 పంటసాయం అందిస్తున్నాం. రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత

తొలి ఏడాదిలోనే రూ.10,209 కోట్లును రైతులకు ఇచ్చాం. అలాగే రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చాం. ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49వేలు లబ్ధి చేకూరుతోంది. ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతుంది. పగటిపూట కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించాం. ఈ ఖరీఫ్‌ నాటికి 82శాతం ఫీడర్లలో 9గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. మిగిలిన 18శాతం రబీనాటికి అందుబాటులోకి వస్తుంది. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్నామని ఏపీ సీఎం తెలిపారు.

వచ్చేఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేసి, రైతులు పండించే 30శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ పంటలను ప్రభుత్వం జనతా బజార్లలో విక్రయిస్తుందని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా జలవనరుల శాఖలో రూ.1,095 కోట్లు ఆదా చేశాం. ప్రాధాన్యతక్రమంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. 2021 చివరికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. రాయలసీమ కరువు నివారణ కోసం తెస్తున్న ప్రాజెక్ట్‌లపై వివాదాలు సృష్టిస్తున్నారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా అనుకున్నది సాధించేక్రమంలో ముందుకెళ్తామని తెలిపారు.



సంబంధిత వార్తలు