Guntur Shocker: వ్యభిచారం చేస్తావా లేక కూతుర్ని చంపమంటావా..వివాహితకు బెదిరింపులు, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నరసారావుపేట పోలీసులు

తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి ఓ యువతితో ముంబైలో వ్యభిచారం (Narasaraopet Man Forced Woman into Prostitution) చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Guntur, June 7: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి ఓ యువతితో ముంబైలో వ్యభిచారం (Narasaraopet Man Forced Woman into Prostitution) చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు వీరి వేధింపులు తాళలేక వ్యభిచారం చేయించి (Man Forced Woman into Prostitution In Gunturఔ ఆ డబ్బులు తనకు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆ వివాహిత నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

సీఐ ఎం.ప్రభాకరరావు కథనం మేరకు. 26 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి పెద్దకుమార్తెతో కలిసి పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న తల్లితో 2017 నుంచి నివసిస్తోంది. అయితే అప్పటికే ఆమె తల్లి, వినుకొండకు చెందిన దూదేకుల మీరావలి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపుతానని మీరావలి అందర్నీ భయపెట్టాడు. అయితే దీనికి ఆ వివాహిత ఒప్పుకోలేదు.

సీఐ వేధింపులు..మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం, సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో, మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని డిమాండ్, ఆమెవన్నీఅసత్య ఆరోపణలని చెప్పిన సీఐ

దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి వివాహితను కొట్టి బలవంతంగా ముంబాయి తరలించి తొమ్మిది నెలలపాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికిన మీరావలి, సైదా తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు. తొమ్మిది నెలల అనంతరం నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా తనను కొట్టి మళ్లీ బలవంతంగా ఐదు నెలలపాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని పేర్కొంది.

మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్, నాగిని-3తో పాపులర్ అయిన బుల్లితెర నటుడు పూరి, పోలీసులు అదుపులో నిందితుడు

కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని ఆ వివాహిత నిర్ణయించుకుంది. అయితే మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామి మీరావలి, సైదా బెదిరింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో బలవంతంగా వ్యభిచారం చేయించి సుమారు రూ.15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.