Representational Image (Photo Credits: File Image)

Kurnool, June 6: కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సీఐ వేధింపులు తాళలేక ఆదోని 11 టౌన్ స్టేషన్ మహిళా హోంగార్డు శానిటైజర్‌ తాగి (Female home guard consumes sanitizers) ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నానికి ( attempts suicide in Kurnool) ముందు తన ఆవేదనను ఓ సెల్పీ వీడియోలో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

సెల్సీ వీడియోలో (Selfie Video) ఉన్న వివరాల ప్రకారం.. హోంగార్డు రామలక్ష్మిని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆదోనికి బదిలీ చేశారు. వచ్చిన నాటి నుంచి సీఐ నరేష్‌ (Adoni III town circle inspector P Naresh Babu) ఆమెను ఎందుకు వచ్చావు.. పనిష్మెంటా.? వివాదమా.? అంటూ ప్రశ్నిస్తూ ఇటీవల ఆమె పాస్‌పోర్టును తిప్పించాడు. తన పాస్‌పోర్టును ఎందుకు తిప్పి పంపారంటూ సీఐని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించారు.

కులాంతర వివాహం చేసుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి, బాడీని ఇంటికి తీసుకువస్తారని తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయిన తల్లిదండ్రులు, కర్నూలు జిల్లా సున్నిపెంటలో విషాద ఘటన

అయితే ఎమ్మిగనూరులో కుటుంబం ఉండడంతో అక్కడికే పంపించాలని త్రీ టౌన్ సీఐను రామలక్ష్మి (Rama Krishnamma) కోరింది. దీనికి కూడా సీఐ నరేష్ తనను అవమానిస్తూ మాట్లాడారని మనస్తాపం చెందిన రామలక్ష్మి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత శానిటైజర్ తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. తన చావుకు సీఐ కారణమంటూ ఆమె పేర్కొంది. తనను మానసిక క్షోభకు గురిచేసిన సీఐని కఠినంగా శిక్షించాలని రామకృష్ణమ్మ డిమాండ్‌ చేసింది.

మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్, నాగిని-3తో పాపులర్ అయిన బుల్లితెర నటుడు పూరి, పోలీసులు అదుపులో నిందితుడు

ఈ ఘటనపై ఆదోని టూ టౌన్ సీఐ నరేష్ స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఖండించారు. కావాలనే నాపై నిందలు వేస్తుందని ఆరోపించారు. ఆమె జూన్ లో ఇక్కడ జాయిన్ అయిందని..అయితే ఇక్కడ మేల్ హోంగార్డుకు మాత్రమే రిక్వయిర్ మెంట్ ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు చేరవేశానని ఆ రోజే మేల్ హోం గార్డును డ్యూటీలోకి తీసుకున్నామని అందువల్ల ఆమెను పాత చోటుకే వెళ్లాలని మాత్రమే ఆమెతో చెప్పానని తెలిపారు. దీనికే మహిళా హోంగార్డు నాపై వేధింపులంటూ అసత్య ఆరోపణలు చేస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని TOI రిపోర్ట్ చేసింది.