Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

ponnavolu sudhakar reddy (Phoot-File Image)

Vjy, Nov 6: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులకు లీగల్‌ సెల్‌ అండగా నిలిచింది.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ, వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షకట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏ కార్యకర్త మీద అక్రమంగా నిర్బంధించినా పార్టీ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందిస్తుందన్నారు. బాధితులు పార్టీ దృష్టికి తీసుకు రావటానికి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని.. అక్రమ కేసులు వేసిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు. పూర్తి న్యాయ సహకారం పార్టీనే అందిస్తుందని.. జైహింద్ అన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తని నందిగామలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చో పెట్టారని.. ఇదేనా ప్రజాస్వామ్యం?. చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’’ అని పొన్నవోలు తెలిపారు.

ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

అరాచకాలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులా: అంబటి రాంబాబు

వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు వనమా వజ్రబాబు.. నగరంపాలెం, అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్, మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్‌ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్ పవన్ కల్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.

మా మహిళా నాయకురాలు విడదల రజినిపై దారుణంగా అసభ్యకరంగా టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోస్టులు పెడితే పోలీసులు ఆనందమా?. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలి. డీజీపీకి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement