Papikondalu Tour Cancelled: పర్యాటకులకు గమనిక.. నేడు, రేపు పాపికొండల విహారయాత్ర రద్దు.. అకాల వర్షాలకు తోడు ఈదురు గాలులు.. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతిస్తామన్న అధికారులు

ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్రను అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.

Papi Kondalu (Credits: Twitter)

Papikondalu, April 24: పర్యాటకులకు ముఖ్య గమనిక. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహారయాత్రను (Papikondalu Tour) అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు (Rains) తోడు ఈదురు గాలులు కూడా వీస్తుండడంతో పాపికొండల యాత్రను నేడు, రేపు రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రకు అనుమతించనున్నట్టు తెలిపారు.

Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

తిరుమలలో వర్షం

ఉపరితల ద్రోణి కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం 6.30 గంటల సమయంలో రెండోసారి కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. మాడ వీధులు జలమయమయ్యాయి పలు షాపింగ్ కాంప్లెక్స్‌‌లలోకి నీరు ప్రవేశించింది. భక్తులు షెడ్ల కింద తల దాచుకోవాల్సి వచ్చింది.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం