Proddatur Shocker: నాకు సుఖం లేదు, మీరెందుకు బతకాలి? అమ్మ,చెల్లి,తమ్ముడిని దారుణంగా హత్య చేసిన సైకో, పొద్దుటూరులో కిరాతక ఘటన, వాడిని ఉరి తీయాలంటూ తండ్రి ఆవేదన
బంధాలను మరచిన ఆ క్రూరుడు తల్లి, చెల్లి, సోదరుడిని దారుణంగా హత్య (Man Killed His Three family members) చేశాడు.
Amaravati, April 27: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర దారుణ ఘటన (Proddatur Shocker) చోటు చేసుకుంది. బంధాలను మరచిన ఆ క్రూరుడు తల్లి, చెల్లి, సోదరుడిని దారుణంగా హత్య (Man Killed His Three family members) చేశాడు. ఈ దారుణ ఘటన వివరాల్లోకెళితే.. చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కుమారులు, కరీమున్నీసా అనే కుమార్తె ఉన్నారు. అతను బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండగా మిగతా ఇద్దరూ బీరువాల తయారీ పని చేస్తుంటారు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యాయి.
కాగా మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే బాడుగకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కుమార్తె కరీమున్నీసాకు భగత్‌సింగ్ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులతో పాటే ఉంటున్న కరీముల్లా కొన్ని రోజుల నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని పిలిచి మందలించారు.
ఈ క్రమంలో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు హైదర్‌ఖాన్ వీధి పక్కనే ఉన్న మరొక వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఇక వేరుకాపురం పెట్టిన నాటి నుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఒక రోజు భార్యను నిలదీశాడు. మీ వాళ్లు కావాలనే నాపై నిందలు వేస్తున్నారు.. వాళ్లు నీకు చేతబడి చేసి ఉంటారని చెప్పింది.
ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతున్నాడు.
అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి. నాకు సుఖం లేనప్పుడు మిమ్మల్ని బతకనీయనంటూ తల్లి,చెల్లి, తమ్ముడిని హతమార్చాడు. అయితే తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనని కరీముల్లా అన్న మాటలను కుటుంబ సభ్యులు ముందు పట్టించుకోలేదు. తరువాత ఘోరం జరిగింది.
కుటుంబ సభ్యుల మరణవార్తను విన్న తండ్రి చాంద్‌బాషా అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని చంపిన ఆ రాక్షసుడు భూమ్మీద ఉండొద్దు.. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. వాడిని ఉరి తీయండి’అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడున్న వారిని కలిచివేసింది.
కాగా సోదరి కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. 3 నెలల నుంచి అమ్మగారింట్లోనే ఉంటోంది. 2రోజుల క్రితం భర్త రహీముల్లా అత్తగారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. కొన్ని రోజులుండి పంపుతామని కరిమున్నీసా తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలోనే అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. అంటూ అతను రోదిస్తుండటం కలచివేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.