Rains In AP: కొనసాగుతున్న ద్రోణి... ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం
అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Vijayawada, May 6: ఏపీలో (AP) మరికొన్నిరోజుల పాటు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ చిత్తూరు (Chittoor), వైఎస్సార్ కడప (YSR Cuddapah), అల్లూరి, పల్నాడు, ఏలూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని... ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండడమే ఈ వర్షాలకు కారణంగా తెలిపింది.
రేపు కూడా వర్షాలు
రేపు బాపట్ల, ప్రకాశం, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.