Credits: Google (Representational Image)

Newdelhi, May 6: జంతు ప్రేమికులు (పెట్ లవర్స్) (Pet Lovers), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ (Railways) నుంచి శుభవార్త (Good News). రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే (Online) టిక్కెట్లు (Tickets) బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పెంపుడు జంతువులతో రైలు ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.

Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్

ప్రస్తుత నిబంధనలు ఏమిటి?

ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఇందు కోసం ముందుగా ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌ లో కూడా పెంపుడు జంతువులను తరలించవచ్చు.