Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వీడియోతో

డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

Credits: Twitter

Tuni, March 19: కాకినాడ (Kakinada) జిల్లా తుని (Tuni) జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు (RTC Bus) బోల్తా పడింది. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి (Hospital) తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. డ్రైవర్ నిద్ర, మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు

మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. అతివేగంతో.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి.. బోల్తాకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా అంతా నిద్ర మత్తులో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెరు, ఈక్వెడార్‌లను కుదిపేసిన భారీ భూకంపం.. 6.8 తీవ్రతతో భూమికి 66 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. కుప్పకూలిన భవనాలు.. 12 మంది మృత్యువాత



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif