Temple Chariot Catches Fire: ప్రమాదమా..విద్రోహచర్యా? అంతర్వేదిలో అగ్నికి ఆహుతైన రథం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం, విచారణ చేపట్టిన పోలీసులు
ఘన చరిత్ర కలిగిన స్వామి వారి రథం (Temple Chariot Catches Fire) అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
East Godavari, Sep 6: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో (Sri Lakshmi Narasimha Swamy temple) ప్రమాదం చోటుచేసుకుంది. ఘన చరిత్ర కలిగిన స్వామి వారి రథం (Temple Chariot Catches Fire) అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన.. దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడారు. సహయక చర్యులు చేపడుతున్న దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు.
ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను విచారణ అధికారిగా నియమించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చర్యులు చేపట్టాలని దేవదాయ కమిషనర్‌కు మంత్రి సూచించారు.