Govt to soon award tourists visiting 15 domestic destinations per year says Union Minister Prahlad Singh Patel (Photo-Ministry of Tourism Twitter)

Bhubaneswar, January 25: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం (Union Government) అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్యాటన్‌ పర్వ్‌ (Paryatan Parv) కార్యక్రమంలో భాగంగా ఎవరైనా 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో (15 Domestic Destinations per year) పర్యటిస్తే వారి ఖర్చుల పర్యాటక మంత్రిత్వ శాఖ (Ministry of Tourism) భరిస్తుంది.

సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (Union Minister Prahlad Singh Patel) ప్రకటించారు.

అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం

ణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. 2022 సంవత్సరం లోపు ఈ టాస్క్‌ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు.

Here's The Ministry of Tourism Tweet

అలాగే వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక​ బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు.

జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు

టూరిస్టులు సందర్శించిన సంబంధిత ఫోటోలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు.

Here's The Ministry of Tourism Tweet

అయితే టూరిస్టులు స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతుగా ఉంది. కాగా టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

యాదాద్రి చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి

దీంతో పాటుగా టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్‌ కూడా నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువని, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు.

ఫైవ్ స్టార్ హోటల్ అని బుక్ చేసుకున్నారు. తీరా చూస్తే..

మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు.