IPL Auction 2025 Live

AP MLA Tests Positive for COVID-19: ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకు (YCP S.Kota MLA) కూడా కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే (Srungavarapukota MLA) శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, June 23: కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకు (YCP S.Kota MLA) కూడా కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే (Srungavarapukota MLA) శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒకే కుటుంబంలో ఏడుమందికి కరోనా, గుంటూరు జిల్లాలో గంటకు నాలుగు కరోనా కేసులు, ఏపీలో తాజాగా 443 కోవిడ్-19 కేసులు నమోదు, రాష్ట్రంలో 9,372కి చేరిన కేసులు సంఖ్య

గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ( kadubandi Srinivasa Rao) తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా (AP MLA Tests Positive for COVID-19) తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 162కి చేరింది. తాజాగా రెవెన్యూ శాఖలోనూ వైరస్‌ ప్రవేశించింది. జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని ఓ అతిథిగృహంలో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. త్వరలోనే తాను కోలుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే శ్రీనివాస రావు అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు అన్ని రకాల టెస్టులను నిర్వహించారు. అప్పట్లో ఆయనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది. స్వస్థలానికి వచ్చిన తరువాత కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు అలాగే రాజ్యసభ ఎన్నికల్లోనూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ఎమ్మెల్యే శ్రీనివాస రావు కాంటాక్టులను ఆరా తీస్తున్నారు అధికారులు ఎవరెవర్ని కలిశారనే విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. కడుబండికా పాజిటివ్‌గా తేలిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.

తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, శాసనసభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు వంటి పలువురు నేతలు కరోనా వైరస్ బారిన పడ్డారు.