Amaravati, June 22: ఏపీలో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్ పాజిటివ్ కేసులు (AP Coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704నమూనాలు పరీక్షించగా 443 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 New cases) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన 7 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గడిచిన 24 గంటల్లో 83 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4435కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 111కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4826 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా వైరస్ విజృంభిస్తోంది. అన్ని దుకాణాలు తెరవడం, ప్రజలు తమ అవసరాల కోసం రోడ్లపైకి రావడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారితో కూడా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. మహారాష్ట్రలో 4,103 మంది పోలీసులకు కరోనా, 24 గంటల్లో 55 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, మొత్తం 48 మంది కరోనాతో మృతి
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు భూపయ్య చెరువు కాలనీలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకింది. ఐదు రోజుల క్రితం కుటుంబంలోని ఓ మహిళకు కరోనా సంక్రమించింది. దీంతో కుటుంబంలోని ఏడుగురికీ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫలితాలు రాగా అందరికీ కోవిడ్ సోకినట్టు తేలింది. దీంతో వారిని వెంటనే ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి
కాగా, ఇదే కాలనీలో మరొకరికి కూడా వైరస్ సోకింది. ఫలితంగా గ్రామంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 8 మందికి చేరింది. బాధితుల్లో ఆరుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మరోపక్క, ఇప్పటి వరకు మండలంలో 38 మంది కరోనా బారినపడగా, పోడూరులో ఐదు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. గోవాలో తొలి కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 818కి చేరిన మొత్లం కోవిడ్-19 కేసుల సంఖ్య, జలపాతాలకు వెళ్లే మార్గాలను మూసివేసిన అధికారులు
గుంటూరు జిల్లాలో గంటకు నాలుగు కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే 97 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 789 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 553 కాగా.. డిశ్చార్జ్ 230, ఆరుగురు మరణించారు. యాక్టివ్ కేసుల్లో రాష్ట్రంలోనే ‘అనంత’ ముందంజలో ఉంది. ఇప్పటికే జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు జిల్లా అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది.