Valmiki Jayanti Celebrations: అనంతపురంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు, ఏర్పాట్లకు రూ.19 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం, వాల్మీకి మహర్షి కొటేషన్లు మీకోసం
అనంతపురంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగాప్రారంభమయ్యాయి.
Anantapuram, October 13: మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అనంతపురంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగాప్రారంభమయ్యాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.19లక్షలు కేటాయించగా ఇతరజిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు. ఏపీ మంత్రులు శంకరనారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, రెడ్డెప్ప, డాక్టర్ సంజీవకుమార్, పి.బ్రహ్మానందరెడ్డితో పాటు పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జగన్ నిర్ణయం పట్ల బోయ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?
వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతని తండ్రి ప్రచేతనుడు ( Pracheta) అందుకు వాల్మీకి ప్రాచేతసుడు గా ప్రసిద్ధి పొందాడు.
అటవీ తెగకు చెందిన వాడు. వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రెండు కలుపుకుని వాల్మీకి మహర్షి అయ్యాడు. రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన చేసి ఆదికవి అయ్యాడు.
ఆది కావ్యం రామాయణ కావ్యాన్ని 24వేల శ్లోకాలతో 7 కండాలుగా లిఖించిన గ్రంథ కర్త. రామాయణంలో మొత్తం 24వేల పద్యాలు ఉంటాయి. సంస్కృతంలో పద్యాలను రచించడం రామాయణంతోనే ప్రారంభమైందంటే దానికి కారణం మహా ఋషి వాల్మీకినే చెప్పుకోవాలి.
శ్రీరాముడి కుమారులైన లవ, కుశలకు పద్యారూపంలో ఉన్న రామాయణాన్నే వాల్మీకి పాటగా నేర్పించారు.
వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడకూడదు, నాటికలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకి మహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయలను, వాల్మీకులను కించపరిచే విధముగా మాట్లాడితే నేరము, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును.
వాల్మీకి తన జీవిత కాలం చివరి దశలో శ్రీలంకలోనే ముగిచాడని విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన జయంతి రోజున అందరికీ లేటెస్ట్‌లీ టీం శుభాకాంక్షలు చెబుతోంది.