Prakasam Barrage Three Gates Damaged: ప్రకాశం బ్యారేజ్ మొదటి మూడు గేట్లు భారీగా ధ్వంసం.. ఎగువన వస్తున్న భారీ వరదతో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొట్టడంతోనే గేట్లు డ్యామేజీ.. (వీడియోతో)
కృష్ణమ్మకు పై నుంచి భారీగా వరద వస్తోండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నది.
Vijayawada, Sep 2: భారీ వర్షాలతో (Heavy Rains) విజయవాడలో (Vijayawada) అల్లకల్లోలం అవుతున్నది. కృష్ణమ్మకు పై నుంచి భారీగా వరద వస్తోండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఇదే సమయంలో వరద పోటుతో పలు బోట్లు బ్యారేజ్ కు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే.. ప్రకాశం బ్యారేజ్ లోని 3 గేట్లకు ఈ బోట్లు ఢీకొట్టడంతో ఈ మూడు గేట్లు భారీగా ద్వంసమయ్యాయి. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో కూడా భారీగానే డ్యామేజీ అయినట్టు సమాచారం. దీంతో ఏం జరుగుతుందా? అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఇక అటు కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా ఉంది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని… కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు.