Andhra Pradesh: కన్నకూతురుపై అత్యాచారం, మూడేళ్ల విచారణ అనంతరం కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు

విశాఖలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

Law

Visakha, August 22: విశాఖలో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కసాయి తండ్రికి జీవితకాలం జైలుశిక్షను విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం.. 2020లో మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రరావు అనే కసాయి తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి బంధువులు 2020, అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్ర రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా విశాఖ పోక్సో కోర్టులో విచారణ జరిగింది. మూడేళ్లపాటు జరిగిన విచారణానంతరం ఈరోజు ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అనుమతి

రామచంద్రరావుకు జీవితఖైదును విధించడంతో పాటు బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరగడంతో స్పెషల్ పొక్సో కోర్టు ప్రాసిక్యూటర్ కరణం కృష్ణకి కన్నీటితో కృతఙ్ఞతలు తెలిపారు బాధిత కుటుంబసభ్యులు.