Visakhapatnam Shocker: విశాఖలో విషాదం, అర్థరాత్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రిన్సిపాల్, భర్త వేధింపులే కారణమని ఆమె తల్లి ఆరోపణలు
ఓ ప్లే స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ 9Private Play school teacher) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు
Vizag, Feb 28: విశాఖపట్నంలోని స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన (Visakhapatnam Shocker) చోటు చేసుకుంది. ఓ ప్లే స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ 9Private Play school teacher) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసమున్నారు.
ప్రస్తుతం ఏఆర్‌లో కానిస్టేబుల్ అయిన నరేష్ సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తను వదిలి రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతంలోని మయూరినగర్ కి వచ్చేశారు. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు.
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లి చేయిని నరికేసిన తాగుబోతు కొడుకు,త్రిపురలో దారుణ ఘటన వెలుగులోకి
తన 11 ఏళ్ల వయసు గల కుమారుడిని విజయవాడలో ఓ హాస్టల్‌లో చేర్చించారు. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలసి ఆమె ప్రస్తుతం ఆరిలోవలో ఉంటున్నారు. ఏమైందో ఏమో..ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య (commits suicide) చేసుకున్నారు. కొంతసేపటికి తల్లి ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆమె కుమార్తె ఏడుస్తూ సెల్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేసింది.
దీంతో వెంటనే ఎంవీపీకాలనీ లోని బంధువులు, గాజువాకలో ఉన్న అలేఖ్య తల్లి, బంధువులు ఆరిలోవ చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి.. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని అలేఖ్య తల్లి భవాని ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలని వేడుకున్నారు. సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.