 
                                                                 Chittoor, Feb 27: ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన (Chittoor Shocker) చోటు చేసుకుంది. కొడుకు దారి తప్పాడాని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిని చావబాదాడు ఓ కసాయి కొడుకు. తండ్రిపై కర్రతో దాడిచేస్తూ (son attacked father) ఆ దృశ్యాలను ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపిస్తూ వికృతానందం పొందాడు.
చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానికంగా నివసిస్తున్న ఢిల్లీబాబు హోంగార్డుగా పనిచేస్తున్నాడు.అతడి కుమారుడు భరత్(21) మూటలు మోసే కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని గుర్తించిన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రిపై కక్షపెంచుకున్న భరత్ నిన్న సాయంత్రం ప్రియురాలికి వీడియో కాల్ చేసి (showing it to his girlfriend in a video call) తన తండ్రిపై దాడి చేయబోతున్నానని, దానిని చూడాలని చెబుతూ.. కర్రతో తండ్రి తలపై బలంగా బాదాడు. దీంతో తలపగలి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
