Visakhapatnam Shocker: విశాఖపట్నంలో దారుణం, లాడ్జిలో మత్తు ఇంజక్షన్లు, యువతి అనుమానాస్పద మృతి, యువకుడికి గాయాలు

ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి మృతురాలి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి.

Representative image. (Photo Credits: Unsplash)

Anakapalli, May 30: అనకాపల్లి జిల్లా అచ్యుతపురంలో ఓ లాడ్జిలో మహాలక్ష్మి అనే యువతి అనుమానాస్పద మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి మృతురాలి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌కుమార్‌ అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని అక్కడికి మహాలక్ష్మిని రప్పించారు. ఈ క్రమంలో ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించేసరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్న లాడ్జి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

కొడుకులు ఆస్తి కోసం గొడవ చేస్తారని భయం, చనిపోయిన భర్తకు ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు చేసిన భార్య, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే, పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్‌ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను కత్తితో 20 సార్లు పొడిచిన రాక్షసుడు వీడే, యూపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ

వీరిద్దరూ ఇంటర్ నుంచి ప్రేమించుకుని కొద్ది నెలల క్రితం వరకు రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వీరువురూ దూరంగా ఉంటున్నారు. ఈ రోజు శ్రీనివాస్‌.. మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి లాడ్జికి రప్పించాడు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగిందో గానీ యువతి మృతి చెందగా.. శ్రీనివాస్‌ గాయాలతో ఉన్నాడు. ఇక పోలీసులు జరిపిన తనిఖీలో లాడ్జి గదిలోని బాత్రూం సింక్‌లో మత్తు ఇంజక్షన్లు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif