Visakhapatnam Cruise Terminal: విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌, 2021 కల్లా అందుబాటులోకి వస్తుందని తెలిపిన విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు

విశాఖపట్నంలో క్రూయిజ్‌ టెర్మినల్ కు (Visakhapatnam Cruise Terminal) సంబంధించిన పనులు ఊపందుకున్నాయి.

Visakhapatnam Cruise Terminal (photo-ANI)

Visakhapatnam, Oct 30: విశాఖపట్నంలో క్రూయిజ్‌ టెర్మినల్ కు (Visakhapatnam Cruise Terminal) సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ (cruise terminal) కు సంబంధించి మరికొద్ది నెలల్లో పరిపాలన భవనాన్ని సిద్ధం చేస్తాం. 2021 చివరికల్లా అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ అందుబాటులోకి రానుంది. దీని వల్ల విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. ఏపీ తీరంలో ఎక్కడా ఈ తరహా టెరి్మనల్స్‌ లేవు. విశాఖ ప్రజలకు సముద్రయానం అందుబాటులోకి రానుందని విశాఖ పోర్టు ట్రస్టు (visakhapatnam port trust) చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు తెలిపారు.

అంతర్జాతీయ పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి నగరంలో పర్యటించే విధంగా వివిధ ఏర్పాట్లు చేయనున్నారు. టెర్మినల్‌ నిర్మాణంలో అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో,180 మీటర్ల పొడవైన క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మించనున్నారు. ఈ విశాలమైన బెర్త్‌ను రెండు విధాలుగా వినియోగించుకోనున్నారు. క్రూయిజ్‌ రాని సమయంలో సరకు రవాణా చేసే కార్గో నౌకలను కూడా బెర్త్‌పైకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రెడీ, సీఎంతొ పెట్టుబడుల విషయమై భేటీ అయిన స్టీల్ ఉత్పత్తి సంస్థ పోస్కో ప్రతినిధులు

క్రూయిజ్‌లో వచ్చే ఇంటర్నేషనల్‌ టూరిస్టుల చెకింగ్‌ కోసం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ కార్యాలయాలతో పాటు పర్యాటకులు సేదతీరేందుకు పర్యాటక భవన్‌ను నిర్మిస్తున్నారు. దీనికి తోడుగా పరిపాలన భవనం, కరెన్సీ మారి్పడి కౌంటర్లు, విశ్రాంతి గదులు, టూరిజం ఆపరేటర్స్‌ కౌంటర్లు కూడా నిర్మాణం కానున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, చెన్నై, మంగుళూరు పోర్టుల్లో క్రూయిజ్‌ టెర్మినల్స్‌ ఏర్పాటయ్యాయి. అక్కడ నుంచి నౌకలు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ టూరిజం బాగా వృద్ధి చెందింది. విశాఖలోనే అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అడుగులు వేసింది.

ఇక తూర్పు తీరంలో ఎక్కడా క్రూయిజ్‌ టెర్మినల్స్‌ లేవు. కోస్తా తీరంలో కీలక పర్యాటక స్థావరమైన విశాఖలో (Visakhapatnam) ఏర్పాటైతే పర్యాటకం ఊపందుకోనుందని తెలుస్తోంది. కాగా దీని నిర్మాణానికి రూ.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 50 శాతం నిధులను కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ, మరో 50 శాతం టూరిజం శాఖ కేటాయించనుంది. దీనికి సంబంధించి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ ఎసెస్‌మెంట్‌(ఈఐఏ)కూడా పూర్తయ్యాయి.



సంబంధిత వార్తలు