Amaravati, Oct 30: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ముందు ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని (POSCO to Invest in AP) దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ (Steel maker Posco meets AP CM YS Jagan) అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారు.
రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునం దిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులున్నారు.
Here's Check Tweet
Officials from #Posco - one of largest #SouthKorea based Steel cos called on Hon’ble @AndhraPradeshCM @ysjagan & expressed an interest in investing in #AP - our Govt looks forward to working with POSCO. @AndhraPradeshCM @osdkmr @MOFAkr_eng @IndiainROK @Industries_GoAP #BuildAP pic.twitter.com/spzN8nsM00
— S. Rajiv Krishna (@RajivKrishnaS) October 30, 2020
ఇదిలా ఉంట ప్రముఖ కంపెనీ కైనెటిక్ గ్రీన్ ( kinetic Green to invest in ap ) ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన సంగతి విదితమే. ఎలక్ట్రిక్ వాహనాల మేకర్ కైనెటిక్ గ్రీన్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్ ( Electric Golf Cart ) లతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ( Battery swapping unit ) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికోసం భారీగా 1750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కంపెనీ సిద్ధమైంది. గోల్ఫ్ కార్ట్ ప్రాజెక్టు కోసం సెజ్ ( SEZ ) లో యూనిట్ కోసం కంపెనీ పరిశీలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే..ప్రాజెక్టు ప్రారంభించే ఆలోచనలో కైనెటిక్ గ్రీన్ ఉన్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉందని..బ్రాండ్ తో సంబంధం లేకుండా ఎలక్ట్రికల్ త్రీ వీలర్ వాహనాల్ని ( Electrical three wheeler vehicles ) ప్రొమోట్ చేసేందుకు ఎలక్ట్రికల్ బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ను గోల్ఫ్ కార్ట్ ప్రాజెక్టుతో పాటు నెలకొల్పాలనేది ఆలోచన అని కైనెటిక్ గ్రూప్ సీఈవో ( kinetic group ceo ) సులజ్జా ఫిరోదియో మోత్వానీ ( Sulajja Firodia motwani ) తెలిపారు. ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా..ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.