Visakha Utsav 2019-Highlights: ముగిసిన విశాఖ ఉత్సవ్, మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం, ఎక్కడా వ్యతిరేకత కానరాని వైనం, పూల వర్షం ద్వారా ప్రతిపక్షాలకు ఝలక్, ఈ విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?

ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌(Daggubati Venkatesh), సినీ నేపధ్య గాయకులు గీతామాధురి, సింహా, ఆదిత్య , వెంకీ మామ డైరెక్టర్‌ బాబీ, సినీ సంగీత దర్శకుడు థమన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ (Anchor Sma) వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. విశాఖ వాసులు అశేషంగా తరలిరావడంతో బీచ్‌ రోడ్‌ కిక్కిరిసిపోయింది.

vishakha-utsav-2019-grand-finale-ended-here-are-the-highlights (Photo-Twitter)

Visakhapatnam, December 30: అశేష జనసందోహం హర్షాతిరేకాల మధ్య విశేష కార్యక్రమాల మేళవింపుతో విశాఖ ఉత్సవ్‌ (Visakha Utsav 2019)ఘనంగా ముగిసింది. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌(Daggubati Venkatesh), సినీ నేపధ్య గాయకులు గీతామాధురి, సింహా, ఆదిత్య , వెంకీ మామ డైరెక్టర్‌ బాబీ, సినీ సంగీత దర్శకుడు థమన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ (Anchor Sma) వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. విశాఖ వాసులు అశేషంగా తరలిరావడంతో బీచ్‌ రోడ్‌ కిక్కిరిసిపోయింది.

విశాఖ ఉత్సవ్‌లో కళా కారుల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టు కుంది. ఆట సందీప్‌ టీమ్‌, ఎంజే 5 టీమ్‌ల డాన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌లు అందరినీ ఉర్రూతలూగించాయి. దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ఫుట్‌ జగ్లింగ్‌, ఫుట్‌ ఆర్చరీ విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచడంతో పాటు ఆనందాన్ని అందించాయి.

అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది విశాఖ (Visakha)వాసులు ఏపీ సీఎం (AP CM) మీద చూపిన అభిమానం గురించి. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన ఇప్పటి సీఎం వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మని (YS Vijayamma) అక్కడి వాసులు ఎన్నికల్లో ఓడించారు. వైసీపీ పార్టీని (YSRCP) దూరం పెట్టారు.అయితే ఈ సారి మాత్రం పూర్తిగా వైసీపీకి (YCP)మద్దతు ఇచ్చారు. ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ వైపు నిలిచింది. ఆ సంగతి అలా ఉంచితే వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆరు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రజలను ఆకట్టుకుంటున్నా ప్రతిపక్షాలు వాటిపై విమర్శల మీద విమర్శలు చేస్తున్నాయి. అయినప్పటికీ సీఎం జగన్ మొండిగా వాటిని అమల్లోకి తీసుకువస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల్లో జగన్ పై ఎలాంటి అభిప్రాయం ఉందోనన్న సందేహం మొదలైంది కూడా. అయితే విశాఖలో ఏపీ సీఎం జగన్ పై ఉత్తరాంధ్ర ప్రజలు చూపిన అభిమానాన్ని చూస్తే ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం అలాగే ఉందని మరోసారి రుజువైంది. పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేస్తున్నాయని ఈ విశాఖ ఉత్సవ్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పవచ్చు.

Visakha Utsav 2019-Highlights

ఇక మూడు రాజధానుల విషయంలో అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇది కూడా ఏపీ సీఎం వైయస్ జగన్ కి మైనస్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఆ వ్యతిరేకత అమరావతి ప్రాంతంలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కానరావడం లేదు. అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతిలోని రెండు మూడు ప్రాంతాల ప్రజలు మాత్రమే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని అనే జగన్ నిర్ణయంపై ఉత్తరాంధ్ర నుంచి భారీ స్పందన వస్తోందని ఈ విశాఖ ఉత్సవ్ ద్వారా తేటతెల్లమైందని చెప్పవచ్చు.

మూడు రాజధానుల అంశంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

రాజధాని విషయంపై హైవపర్ కమిటీ వేసిన నేపథ్యంలో జనవరి చివరి నాటికి దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు మాత్రం ఈ విషయం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అమరావతి రైతులకు సపోర్ట్ చేస్తే మిగతా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కూడా ప్రతిపక్షాల్లో నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో వారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

విశాఖ ఉత్సవ్ హైలెట్స్

మహిళల రక్షణకోసం బిగ్‌థింక్‌ ఏర్పాటు చేసిన పరికరాన్ని ప్రదర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, కళాకారులకు పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వినరుచంద్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, గుడివాడ అమర్‌నాథ్‌, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ , జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Welcome to AP CM

విశాఖ వాసులకు కృతజ్ఞతలు : హీరో వెంకటేష్‌

విశాఖ ఉత్సవ్‌కు సడన్‌ సర్‌ప్రైజ్‌గా వచ్చిన ప్రముఖ సినీ నటుడు వెంకటేష్‌ విశాఖవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు విశాఖ హోమ్‌టౌన్‌ లాంటిదన్నారు. విశాఖలో షూటింగ్‌ జరుపుకున్న ఎన్నో సినిమాలలో తాను నటించానని, ఈ బీచ్‌ చూస్తుంటే తనకు మల్లీశ్వరి సినిమా గుర్తుకువస్తుందని అన్నారు. విశాఖ ఉత్సవ్‌కు అశేషంగా వచ్చిన విశాఖవాసులను చూస్తుంటే సముద్రం పక్కన మరో సముద్రంలా కనిపిస్తోందన్నారు. ఆడవాళ్ళకు రక్షణగా ఉండాలని చెపుతూ ఆడాళ్ళకు రక్షణ కల్పించినవాడే మగాడు అని అన్నారు.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సినీ పరిశ్రమ విశాఖకు తరలి రావాలని, వైజాగ్ సినీ పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖలో హైదరాబాద్ ను తలదన్నే సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. సినీ పరిశ్రమ కు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ ఉత్సవ్‌‌ ముగింపులో భాగంగా మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి రిలీజ్ చేశారు. కార్యక్రమంలో సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌‌, తమన్​ సంగీత విభావరి అలరించింది. ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు టూరిస్టులను ఆకట్టుకున్నాయి.

ఉర్రూతలూగించిన థమన్‌ బృందం

రెండో రోజు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఒక ఎత్తయితే థమన్‌ బృందం ప్రదర్శన మరో ఎత్తుగా చెప్పవచ్చు. సుమారు రెండు గంటలపాటు సాగిన బృంద ప్రదర్శన యువతను ఉర్రూతలూగించింది. థమన్‌తోపాటు సింహ, శ్రీకృష్ణ, ఆదిత్య, హనుమాన్‌, గీత మాధురి, మోహన భోగరాజు, అధిత భావరాజుతో కూడిన గాయకుల బృందం మాస్‌, క్లాస్‌ బీట్‌లతో అలరించింది. వెంకీ మామ చిత్రంలోని ‘మామా మామా వెంకీ మామా’ అన్న థీమ్‌ సాంగ్‌తో ప్రారంభమైన బృంద ప్రదర్శన, ‘అనగనగా అరవింద అట తన పేరు’ అంటూ.. థమన్‌ మ్యూజిక్‌లో అందించిన హిట్‌ సాంగ్స్‌తో సాగింది. ప్రతి పాటను సందర్శకులు ఈలలు, చప్పట్లతో ఎంజయ్‌ చేస్తూ సందడి చేశారు.

ఫాలోయింగ్ ద్వారా పరోక్షంగా ప్రతిపక్షాలకు సందేశం

గతంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలను తెలిపేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. అది కూడా విజయవంతమయింది. అయితే విశాఖ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి వచ్చిన సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుమారు 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగన్ కాన్వాయ్ మీద పూల వర్షం కురిపించారు. ఆ రకంగా విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌కు వచ్చిన ఫాలోయింగ్ కంటే సీఎంగా జగన్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే సందేశాన్ని పరోక్షంగా ప్రతిపక్షాలకు తెలియజేశారు.