Vitapu Balasubrahmanyam: ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఎం జగన్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, కొత్త సభ్యులతోమండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్న విఠపు

ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు.

AP Legislative council (Photo-Twitter)

Amaravati, June 19: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం (Vitapu Balasubrahmanyam as protem speaker) ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు మండలి చైర్మన్ గా వ్యవహరించిన మహ్మద్ షరీఫ్ ఇటీవల రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆ నలుగురు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రొటెం స్పీకర్ అవసరం కాగా, విఠపు బాలసుబ్రహ్మణ్యం పేరును సీఎం జగన్ ప్రతిపాదించారు.

సీఎం సిఫారసు మేరకు ఏపీ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంపికను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. త్వరలోనే కొత్త సభ్యులతో విఠపు మండలిలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అనుమతివ్వండి, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

మండ‌లికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వ‌ర‌కు బాలసుబ్రమణ్యం (Vitapu Balasubrahmanyam) ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. కాగా, గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు కూడా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన సంగతి విదితమే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌ నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పొడగింపు, సాయంత్రం 6 వరకు సడలింపులను పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 21 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు

మండలి ఛైర్మన్ తో పాటు వైస్ ఛైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఛైర్మన్ పదవీ విరమణ చేయగా.. డిప్యూటీ ఛైర్మన్ ఈ నెలలోనే పదవీ కాలం ముగియనుంది. అయితే, మండలి ఛైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది. అయితే.. ఇప్పటికే ముఖ్యమంత్రి మండలి ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif