Andhra Pradesh Shocker: మద్యం తాగి వస్తావా..కోపంతో భార్యను చంపేసిన భర్త, అరకు ప్రాంతంలో దారుణ ఘటన, తూర్పుగోదావరి జిల్లాలో పకోడి బండి వద్ద ఘర్షణ, కారు ఢీకొట్టడంతో యువకుడుమృతి

భార్య మందు తాగిందన్న క్షణికావేశంలో భర్త దాడి చేయడంతో ఆమె దుర్మరణం పాలైన ఘటన (Andhra pradesh Shocker) విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో ఈ ఘటన (Vijayangaram Shocker) కలకలం రేపింది.

Representational Image | (Photo Credits: PTI)

Vizianagaram, Mar 29: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య మందు తాగిందన్న క్షణికావేశంలో భర్త దాడి చేయడంతో ఆమె దుర్మరణం పాలైన ఘటన (Andhra pradesh Shocker) విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో ఈ ఘటన (Vijayangaram Shocker) కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..విశాఖ జిల్లా అరకు మండలం పూజారిపుట్టు గ్రామానికి చెందిన మర్రి శోభన్‌ (30), భార్య మర్రి తులసి(24) ఏడాది కిందట నుంచి మాతుమూరులోని ఓ రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తులసి తన తల్లితో కలిసి శనివారం ఉదయం సాలూరు వెళ్లింది.

అయితే ఆమె మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చింది. మద్యం సేవించడంపై భర్త శోభన్‌ మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో తాము నివసిస్తున్న ప్రదేశానికి కొంత దూరం భార్యను తీసుకెళ్లి మోహంపై కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలైన తులసి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయడు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రసాద్‌ తెలిపారు.

కమ్మేసిన పొగ..విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, గ్యాస్ సిలిండర్ల లారీ-రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, ముగ్గురు దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం

ఇక తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని వీరవరంలో వీరబాబు అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం (West Godavari Shocker) సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో పకోడి బండి వద్ద స్వల్ప వివాదం చోటకోవటంతో వీరబాబు ఆ పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో బండి యజమాని ఏసు, ఆయన కొడుకు శివకు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో శివను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పదో తరగతి చదువుతున్న శివ తన తండ్రికి వ్యాపారంలో పకోడి బండి వద్ద సహాయంగా ఉంటున్నాడని తెలుస్తోంది. బాలుడు మృతి చెందడంతో వీరవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వీరవరం గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.